ఒక గ్రహంలో మూడు రాశులు కలవటాన్ని త్రిగ్రాహి యోగం అంటారు. అలాంటి త్రిగ్రాహి యోగం సుమారు 10ఏళ్ల తర్వాత మీన రాశిలో ఏర్పడనుంది. ఈ రాశిలో బుధుడు, సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుందని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధాదిత్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా చెబుతున్నారు నిపుణులు. జాతక రిత్యా ఈ యోగం ఉన్న రాశివారికి సంపద పెరుగుతుందని చెబుతారు.
పుత్ర కారకుడైన గురువు మిత్ర క్షేత్రంలో అనుకూలంగా ఉండడం వల్ల, రవి, కుజులు కూడా మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఆరు రాశుల వారు సంతానం విషయంలో నాలుగు నెలల కాలంలో అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభ రాశుల వారికి పిల్లల చదువులు, ఉద్యోగాలకు సంబంధించి బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. పిల్లల నుంచి ఏవైనా సమస్యలున్న పక్షంలో అవి తప్పకుండా పరిష్కారం అవుతాయి. పిల్లల కారణంగా తల్లితండ్రులు ప్రశాంతంగా, ఆనందంగా కాలం గడిపే అవకాశం కూడా ఉంటుంది.
- మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడితో గురువుకు పరివర్తన జరగడం వల్ల పిల్లలకు సంబంధించిన శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి తప్పకుండా శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం పడుతుంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉండకపోవచ్చు. విదేశాల్లో స్థిరపడి చాలా కాలంగా ఇంటికి రాని పిల్లలు కూడా ఇంటికి రావడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి పుత్ర కారకుడు అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉండడంతో పాటు, కుజ, గురు గ్రహాల పరివర్తన కూడా జరిగినందువల్ల పిల్లలు విజయాల మీద విజయాలు సాధించే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా ఘన విజయాలు సాధించడం జరు గుతుంది. పిల్లల్లో ఒకరు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. సంతానం లేని వారు సంతానానికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది. సంతాన సమస్యలేవీ ఉండక పోవచ్చు.
- సింహం: ఈ రాశివారికి పిల్లలకు సంబంధించి సమయం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంది. ప్రణా ళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో పిల్లలు ఆశించిన దానికంటే వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. పిల్లల ప్రతిభాపాటవాలు బాగా రాణిస్తాయి. పిల్లలకు చదువులతో పాటు క్రీడలు, కళల వంటివి కూడా వంటబడతాయి. సంతాన లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లల విషయంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారి జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది.
- తుల: సంతాన కారకుడైన గురువు ఈ రాశిని పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల సంతానపరంగా ఈ రాశివారు అనేక శుభవార్తలను వినే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో రవి, కుజుల కలయిక వల్ల సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి ఎటువంటి సమస్య లున్నా సునాయాసంగా పరిష్కారం అవుతాయి. పిల్లలు రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో తిరుగులేని విధంగా ఉత్తీర్ణులవుతారు. క్రీడారంగంలోని వారికి పురోగతి ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి పుత్ర కారకుడు గురువు పంచమ స్థానంలోనే ఉన్నందువల్ల సంతానానికి సంబం ధించి శుభవార్తలు వినడంతో పాటు సంతానం వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. పిల్లల్లో ఒకరికి విదేశీయాన యోగం కూడా పడు తుంది. పిల్లలు చదువుల్లోనూ, వృత్తి, ఉద్యోగాల్లోనూ మంచి గుర్తింపు పొందుతారు. పిల్లల విష యంలో సమస్యలేవీ ఉండకపోవచ్చు. పిల్లల విషయంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది.
- కుంభం: ఈ రాశివారికి గురువు అనుకూలంగా ఉండడంతో పాటు పంచమ స్థానం మీద కుజుడు, రవి వంటి శుభ గ్రహాల దృష్టి ఉండడం వల్ల సంతానానికి సంబంధించి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణించడంతో పాటు, తల్లితండ్రులకు బాగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.