Budhaditya Yoga: ధనూ రాశిలో బుధ గ్రహంతో రవి కలయిక.. ఆ రాశుల వారికి అనుకోని గొప్ప అదృష్ట యోగం పక్కా..!

ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17 వరకు ఎనిమిది రాశులకు ఒక మంచి అదృష్టం పట్టబోతోంది. కీలకమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి ప్రతిష్టంభనలు, ఆటంకాలున్నా తొలగిపోయి, అంచనాలకు మించిన పురోగతి చోటు చేసుకుంటుంది. ఈ నెల 17న రవి ధనూ రాశిలోని బుధ గ్రహంతో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాన్ని ఒక గొప్ప అదృష్ట యోగం పరిగణించడం జరుగుతోంది.

Budhaditya Yoga: ధనూ రాశిలో బుధ గ్రహంతో రవి కలయిక.. ఆ రాశుల వారికి అనుకోని గొప్ప అదృష్ట యోగం పక్కా..!
Budhaditya Yoga

Edited By:

Updated on: Dec 14, 2023 | 6:16 PM

ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17 వరకు ఎనిమిది రాశులకు ఒక మంచి అదృష్టం పట్టబోతోంది. కీలకమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి ప్రతిష్టంభనలు, ఆటంకాలున్నా తొలగిపోయి, అంచనాలకు మించిన పురోగతి చోటు చేసుకుంటుంది. ఈ నెల 17న రవి ధనూ రాశిలో ఉన్న బుధుడితో కలవడం వల్ల ఆ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాన్ని ఒక గొప్ప అదృష్ట యోగం పరిగణించడం జరుగుతోంది. మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ఇది తప్పకుండా యోగాన్నిస్తుంది.

మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, విదేశీయానం, విదేశాల్లో స్థిరత్వం వంటి విష యాలలో బాగా అనుకూలతలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవ కాశం కూడా ఉంటుంది. ఈ నెల రోజుల కాలంలో ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మిథునం: ఈ రాశికి సప్తమంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగు పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు బాగా రాణిస్తారు. ప్రభుత్వపరంగా అనేక లాభాలు చేకూరు తాయి.

సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ప్రతి విషయంలోనూ మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడ తాయి.

కన్య: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడడం, ఇందులో బుధుడు ఈ రాశినాథుడే కావడం వల్ల కుటుంబ వ్యవహారాలు చక్కబడడం, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం జరుగు తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవ కాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. విద్యార్థులు చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు.

వృశ్చికం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఒత్తిడి అనేది ఉండకపోవచ్చు. ఆస్తి విలువ పెరు గుతుంది. ఆస్తులు కొనే అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం, ప్రాభవం అధికమవుతాయి. ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం అంటే ఈ రాశివారికి అన్ని విధాలా కలిసొచ్చే కాలమని అర్థం. నెల రోజుల పాటు వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు, అధికారానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి. సామాజికంగా కూడా ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెంపొందుతాయి.

కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం, అవకాశాలు ఇనుమడించడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. వీరు జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మీనం: ఈ రాశివారికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల, వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రాధాన్యం పెరగడం, అందలాలు ఎక్కడం, ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారి ప్రయత్నాలు సఫలం కావడం, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది రావడం వంటివి జరుగుతాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి కూడా శుభవార్త అందుతుంది. సామాజికంగా కూడా పట్టు, పలుకుబడి బాగా పెరుగుతాయి.