జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడుతూ తమ గమనాన్ని మార్చుకుంటాయి. ఇలా గ్రహాల కదలికల సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో కూడా నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు ప్రతి నెల తమ రాశిని మార్చుకుంటాడు. దీంతో సూర్యుడు ఏప్రిల్ లో మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఇప్పటికే మేష రాశిలో గ్రహాల్లో యువరాజైన బుధుడు ఉన్నాడు. దీంతో మేషరాశి వేదికగా సూర్యుడు బుధుడు కలయిక జరిగి అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ బుధాదిత్య యోగంతో కొన్ని రాశులకు శుభాలను తీసుకుని రానుంది. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ మేష రాశి వేదికగానే సూర్యుడు, బుధుడి సంయోగం జరగనుంది. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధాదిత్య యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు మంచి స్థాయికి వెళతారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల వలన లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూసే వారికీ గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. రుణాలు తీర్చి సంతోషముగా ఉంటాయి. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తికీ ఈ బుధాదిత్య రాజయోగంసానుకూల ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వీరి సొంతం.. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సక్సెస్ అవుతారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బులను దాచే ప్రయత్నం చేస్తారు.
మీన రాశి: ఈ రాశికి చెందిన వారికీ కూడా సూర్యుడు,, బుధుడి కలయిక వలన ఆర్థికంగా శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ అందంగా ఉండనుంది. ఉద్యోగ, వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. కెరీర్ లో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు