Money Horoscope
సాధారణంగా బుధ, శుక్రులు కలిసినప్పుడు, ఆ కలయిక కొన్ని రాశులకు అనుకూలంగా ఉండి, శుభ ఫలితాలనిస్తుంది. అయితే, ఇతర రాశులకు కూడా ఆ కలయిక ధన లాభం కలిగిస్తుంది కానీ, గట్టి ప్రయత్నం అవసరమవుతుంది. అది వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులకు అప్రయత్న ధన లాభం కలిగిస్తుండగా, మిగిలిన మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి ప్రయత్నపూర్వక ధన లాభం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం మిథున రాశిలో కలిసి ఉన్నాయి. నెలాఖరు వరకు ఈ కలయిక మిథున రాశిలో కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల ధన లాభాలకు గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగానైనా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. రావలసిన డబ్బును కొద్ది ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. మొండి బాకీలు, బకాయిలు కూడా చేతికి అందు తాయి. ఆస్తి వ్యవహారాల్లో రాజీమార్గం అనుసరించి వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా జీతభత్యాల పెరుగుదల విషయంలో అధికారులను ఒప్పించడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి 12వ రాశిలో బుధ, శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల అధికాదాయం కోసం కొద్ది పాటి వ్యయం తప్పకపోవచ్చు. అధికారులను పనితీరుతో మెప్పిస్తారు. రావలసిన డబ్బును అతి కష్టం మీద రాబట్టుకుంటారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పొదుపు పాటిస్తారు. డబ్బును దాచే ప్రయత్నం చేస్తారు. కొందరు స్నేహితులతో కలిసి వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపట్టి ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధ, శుక్ర గ్రహాల యుతి జరిగినందువల్ల ఆదాయం పెరగడానికి గట్టి ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలని స్తుంది. ఆదాయ ప్రయత్నాలతో పాటు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆదాయంలో కొంత భాగాన్ని మదుపు చేసే అవకాశం కూడా ఉంది. మరింత ఎక్కువగా జీతభత్యాలు సంపాదించడానికి ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో బుధ, శుక్రుల వల్ల ప్రయత్నపూర్వక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలకు, అదనపు శ్రమకు సిద్ధపడతారు. వ్యాపార భాగస్వాము లతో విభేదాలను పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాల్లో సహకారం అంది స్తారు. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బును, బాకీలను గట్టి పట్టుదలతో వసూలు చేసుకుంటారు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు.
- మకరం: ఈ రాశివారికి అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రమ పెరుగుతుంది. పొదుపు మీద దృష్టి పెడతారు. వైద్య ఖర్చులతో సహా అన్ని ఖర్చుల్నీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకుంటారు. ఆర్థిక సహాయాలు, దానధర్మాలకు కళ్లెం వేస్తారు. మిత్రులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తారు. తల్లితండ్రుల తోడ్పా టుతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. కొత్త రంగాల్లో డబ్బు మదుపు చేసే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల కలయిక చోటు చేసుకోవడం వల్ల గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్య లను తగ్గించుకోవడం మీద శ్రద్ద పెడతారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ఆదాయాన్ని పెంచు కోవడంతో పాటు అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సత్సం బంధాలను పెంచుకునే అవకాశం ఉంది. జీతభత్యాలు, అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది.