Budha Gochar in Mesha Rashi
వివేకానికి, విజ్ఞానానికి, బుద్ధికి కారకుడు, సమస్యల పరిష్కర్త అయిన బుధుడు ప్రస్తుతం మేష రాశిలో జూన్ 1వ తేదీ వరకు సంచారం చేయడం జరుగుతుంది. బుధుడు మేష రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా అనుకూలంగా ఉండడం, వారిని కొన్ని సమస్యల నుంచి బయటపడేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారికి బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశుల వారు వ్యక్తిగత, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశిలో బుధ సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, అనా రోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని పనులు, వ్యవహారాలు తేలి కగా పూర్తవుతాయి. ఒప్పందాలు కుదర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ఆశించిన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. తప్పకుండా కొన్ని శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ప్రధానంగా హోదా పెరగడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందు తాయి. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగు తుంది. లౌక్యంగా వ్యవహరించి వ్యక్తిగత పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యల నుంచి కూడా ఊరట లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగు తాయి. ఆదాయం పెరగడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులవుతారు.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల సర్వత్రా ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలు గులోకి వస్తాయి. స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. తీర్థ యాత్రలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలే వింటారు. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పితృవర్గం నుంచి సంపద కలిసి వస్తుంది.
- తుల: ఈ రాశికి సప్తమంలో బుధ సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యల నుంచి, దాంపత్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోయి, రాబడి పెరగడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో అనుకూలతలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన ఒప్పందాలు జరుగుతాయి. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలన్నీ సుగమం అవుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఉద్యోగ సమస్యలు పరిష్కా రమై సానుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. విదేశీ యానానికి అవ కాశాలు మెరుగుపడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకా శముంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో దూసుకుపోతారు.