Budha Gochar 2023: తులా రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి మహా యోగం పట్టబోతోంది.. అందులో మీరున్నారా..?

| Edited By: Janardhan Veluru

Oct 18, 2023 | 1:55 PM

Mercury Transit 2023: తులా రాశి బుధుడికి మిత్ర క్షేత్రం. ఇక్కడ బుధుడు దాదాపు స్వక్షేత్రంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఈ నెల 19న ఈ రాశిలో ప్రవేశిస్తున్న బుధ గ్రహం ఇక్కడ నవంబర్ 6వ తేదీ వరకు సంచరిస్తాడు. తెలివితేటలకు, ప్రతిభా పాటవాలకు, సమయస్ఫూర్తికి, ఆచితూచి వ్యవహరించడానికి కారకుడైన బుధుడు ఈ తులా రాశిలో ప్రవేశించినప్పడు ఈ కారకత్వాలన్నీ మరింతగా పెరుగుతాయి. ఇదే రాశిలో ప్రస్తుతం రవి, కుజ, కేతువులు సంచరిస్తున్నప్పటికీ..

Budha Gochar 2023: తులా రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి మహా యోగం పట్టబోతోంది.. అందులో మీరున్నారా..?
Budha Gochar 2023
Follow us on

Mercury Transit 2023: తులా రాశి బుధుడికి మిత్ర క్షేత్రం. ఇక్కడ బుధుడు దాదాపు స్వక్షేత్రంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఈ నెల 19న ఈ రాశిలో ప్రవేశిస్తున్న బుధ గ్రహం ఇక్కడ నవంబర్ 6వ తేదీ వరకు సంచరిస్తాడు. తెలివితేటలకు, ప్రతిభా పాటవాలకు, సమయస్ఫూర్తికి, ఆచితూచి వ్యవహరించడానికి కారకుడైన బుధుడు ఈ తులా రాశిలో ప్రవేశించినప్పడు ఈ కారకత్వాలన్నీ మరింతగా పెరుగుతాయి. ఇదే రాశిలో ప్రస్తుతం రవి, కుజ, కేతువులు సంచరిస్తున్నప్పటికీ, ఈ రాశిలో బుధుడికి ఉన్నంత బలం ఆ మూడు గ్రహాలకూ ఉండదు. తులలో బుధుడు ఎంతో సమతూకంతో వ్యవహరిస్తాడు. తులా బుధుడి వల్ల ఏడు రాశుల వారు లబ్ధి పొందబోతున్నారు. అవి: మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభం.

  1. మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు పంచమ స్థానమైన తులా రాశిలో ప్రవేశించడం వల్ల వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి బాగా ప్రయోజనం పొందుతారు. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఆధ్యా త్మిక చింతన మపెరుగుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి నాలుగవ స్థానంలో బుధ సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు లాభాలు పండిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు మెరుగుపడతాయి. తల్లి నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరిగే అవ కాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు.
  3. కన్య: ఈ రాశినాథుడైన బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగు తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  4. తుల: ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల బుధుడికి దిగ్బలం పట్టింది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవ కాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. సమాజంలో ఒక ప్రముఖుడుగా చలామణీ అవు తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  5. ధనుస్సు: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ మాట, మీ చేత చెల్లుబాటవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణికి కూడా అదృష్ట యోగం పడుతుంది. పిల్లలు ఆశిం చిన దాని కంటే ఎక్కువగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడ తాయి.
  6. మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీతో అధికారాలను పంచుకోవడం గానీ, మీ మీద ఎక్కువగా ఆధారపడడం గానీ జరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఫలించి మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు.
  7. కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధుడు ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి శుభవార్తలు అందు తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయానానికి ఆఫర్లు అందుతాయి. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు.