Budh Vakri: వక్ర బుధుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

| Edited By: Janardhan Veluru

Nov 22, 2024 | 7:06 PM

వృశ్చిక రాశిలో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 15 వరకు వక్రిస్తున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతున్నప్పటికీ మరి కొన్ని రాశులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు, అకౌంట్స్, తెలివితేటలు, సమయస్ఫూర్తి, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అంశాలకు సంబంధించిన బుధుడు వక్రించడం వల్ల కొన్ని రాశుల వారు కొద్దిగా ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.

Budh Vakri: వక్ర బుధుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
Budh Vakri
Follow us on

వృశ్చిక రాశిలో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 15 వరకు వక్రిస్తున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతున్నప్పటికీ మరి కొన్ని రాశులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు, అకౌంట్స్, తెలివితేటలు, సమయస్ఫూర్తి, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అంశాలకు సంబంధించిన బుధుడు వక్రించడం వల్ల మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు కొద్దిగా ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాశుల వారు మరకతం లేక పచ్చ అనే రాయిని ఉంగరంలో ధరించడం గానీ, పచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించడం గానీ, గణపతిని ఎక్కువగా పూజించడం గానీ చేయడం వల్ల వక్ర బుధ దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల కొన్ని సమస్యలు, వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. తొందరపడి సంతకాలు చేయడం మంచిది కాదు. ఒప్పందాలు కుదర్చుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆస్తి వివాదాల్లో ప్రతిష్ఠంభన ఏర్పడు తుంది. ఉద్యోగంలో పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. వాదనలకు అవకాశం ఇవ్వక పోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల కొన్ని కీలక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టాలు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యర్థులు, పోటీదార్ల నుంచి సమస్యలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల్లో కొందరు మీ పేరు ప్రఖ్యాతులను దెబ్బతీసే అవకాశం ఉంది. కుటుంబ కలహాలకు అవకాశం ఉంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందే అవకాశం లేదు.
  3. సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు, గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడ తాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి. డబ్బు ఇవ్వడం, తీసు కోవడం వంటివి పెట్టుకోవద్దు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశిలో బుధుడు వక్రగతి పడుతున్నందువల్ల వ్యక్తిగత సమస్యల వల్ల మానసిక ఆందోళనలు కలుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత ప్రశ్నార్థకంగా మారే సూచనలున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అందకపోవచ్చు. దాంపత్య జీవితంలో ఊహించని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయ త్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి 12వ స్థానంలో వక్ర బుధుడి సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా కావడం జరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా ఒక పట్టాన కలిసి రాదు. రావలసిన డబ్బు సకా లంలో అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధు మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాల్లో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు వక్రించడం వల్ల శుభ కార్యాలకు విఘ్నాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు, బంధువుల నుంచి కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. స్నేహితులు ముఖం చాటేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు తగ్గుతాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు చోటు చేసుకుంటాయి.