
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడు అంటారు. జ్యోతిషశాస్త్రంలో తెలివితేటలు, వాక్కు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారం మొదలైన అంశాలకు అధిపతి అని చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహం ప్రత్యక్ష, తిరోగమన కదలికలు రెండూ చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. బుధుడు బృహస్పతి రాశి అయిన మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇప్పటికే మీనరాశిలో బుధుడు తిరోగమనాన్ని మొదలు పెట్టాడు.
ఏ రాశుల వారికి సమస్యలంటే
బుధ గ్రహం తిరోగమన గమనం మొత్తం 12 రాశుల వారిపైనా ప్రభావం చూపుతుంది. అయితే బుధ గ్రహం తిరోగమన గమనం కొన్ని రాశుల వారి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ప్రతి రంగంలోనూ ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
రాశుల్లో మొదటి రాశి మేష రాశి. ఈ రాశి అధిపతి కుజుడు. మేష రాశి 12వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది నష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. 12వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల మేష రాశి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మేష రాశి వారు తమ ఆదాయాన్ని తెలివిగా ఖర్చు చేయాలి. దాచుకున్న డబ్బులను ఖర్చు చేసే ముందు నూటికి పదిసార్లు ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఆర్ధికంగా చెడు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.
కన్య రాశి రాశుల్లో ఆరవ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం బుధుడు. బుధుడు కన్య రాశిలోని ఏడవ ఇంట్లో తిరోగమనం చెందాడు. జాతకంలో ఏడవ ఇల్లు జీవిత భాగస్వామిది. ఇప్పుడు బుధుడు తిరోగమనంలోకి మారడంతో ఈ రాశికి చెందిన వివాహితులకు తమ జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది.
ధనుస్సు రాశుల్లో తొమ్మిదవ రాశి. ఈ రాశికి అధిపతి దేవ గురువు బృహస్పతి. ధనుస్సు రాశి నాల్గవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. జాతకంలో ఈ స్థానం ఇల్లు, భూమి, వాహనం, తల్లికి సంబంధించినది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఇల్లు, భూమి, వాహనాల నుంచి ప్రయోజనాలను కోరుకుంటే, కష్టపడి పనిచేయండి. తల్లి నుంచి తగిన మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తులు ఏ పని చేసినా చాలా ఓపికగా చేయాలి. చెడు సహవాసంకు దూరంగా ఉండండి. లేకుంటే ఆర్ధికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..