Horoscope Today: ఈ రాశివారి ఇంటా బయటా చికాకులే.. అందులో మీ రాశి ఉందా.?

| Edited By: Ravi Kiran

Jan 12, 2023 | 9:38 AM

ఇంటా బయటా కొన్ని చికాకులు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు కూడా ఒక పట్టాన పూర్తి కావు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో

Horoscope Today: ఈ రాశివారి ఇంటా బయటా చికాకులే.. అందులో మీ రాశి ఉందా.?
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో చిన్నాచితకా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు పట్టుదలగా కొన్ని లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ పరంగా ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు వ్యవహారాల్లో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం ఉంటుంది. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ
వ్యవహారాల్లో చాలా ముందుకు వెళతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా కొన్ని చికాకులు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు కూడా ఒక పట్టాన పూర్తి కావు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మటం మంచిది కాదని గ్రహిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ పరంగా రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంటి పనులతో బయట తిరగాల్సి వస్తుంది. దగ్గర బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ పనుల్లో మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడటం మంచిది కాదు. కొత్త నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. ఐటీ ఉద్యోగులు విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగపరంగా బాగానే ఉంది. అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ప్రేమ సంబంధం ఖాయం అవుతుంది. పిల్లల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు సంపాదిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులు అండగా నిలబడతారు. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు మంద కొ డిగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ప్రతి పనిలోనూ ఒత్తిడి, శ్రమ ఉంటాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో సహచరుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి కొన్ని చికాకులు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. ఇరుగుపొరుగు సమస్యల్లో తలదూర్చికపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో ఆచి చూచి అడుగు వేయాల్సి ఉంటుంది. బంధుమిత్రుల్లో కొందరితో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాల నుంచి తీపి కబురు వింటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పిల్లలు చదువుల్లో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు సానుకూల పడతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలినాటి శని కారణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలకు, శ్రమకు, తిప్పటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మితిమీరిన ఔదార్యంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తనకు మాలిన ధర్మం పనికిరాదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి నిపుణులు బాగా బిజీ అవుతారు. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగులు పని భారంతో ఇబ్బందులు పడటం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.