Astro Tips: జాతకంలో బుధ స్థానం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఈ లక్షణాలతో తెలుసుకోండి..

|

Mar 26, 2025 | 11:50 AM

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా చెబుతారు. బుధుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. జాతకంలో బుధ గ్రహం బలం, బలహీనత ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడా లేదా బలహీనంగా ఉన్నాడా అని తెలుసుకోవాలనుకుంటే.. కొన్ని లక్షణాలను చూడటం ద్వారా తెలుసుకోవచ్చు.

Astro Tips: జాతకంలో బుధ స్థానం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఈ లక్షణాలతో తెలుసుకోండి..
Budha Astro Tips
Follow us on

తొమ్మిది గ్రహాలకు సంబంధించిన విశేషాలు జ్యోతిషశాస్త్రంలో కనిపిస్తుంది. ఈ నవ గ్రహాల్లో ఒకటి బుధ గ్రహం. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, గణితం, వ్యాపారం, చర్మానికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో బుధుడు బాగుంటే జీవితంలో అంతా మంచే జరుగుతుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే, జీవితంలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో జాతకంలో బుధ గ్రహ స్థానం బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అని ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాం. జాతకంలో బుధుడు బలమైన లేదా బలహీన స్థితిలో ఉంటే దానికి సంకేతాలు ఏమిటి?

బలంగా ఉంటే ఈ లక్షణాలు

ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. బుధుడు బలంగా ఉన్న వ్యక్తులు తెలివిగా ఉంటారు. ఎటువంటి విషయాలను అయినా సరే తక్షణమే అర్థం చేసుకుంటారు. ఎటువంటి విషయాలను అయినా గుర్తుంచుకుంటారు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు రాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువులను ఆరాధిస్తారు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు.

బుధుడు బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు

ఎవరి జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటాడో.. వారు అనేక వ్యాధుల బారిన పడతారు. ఒక వంశపారంపర్య వ్యాధి వస్తుంది. బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తి జీర్ణశక్తి బలహీనపడుతుంది. కడుపులో నొప్పితో ఇబ్బంది పడతారు. గోర్లు, దంతాలు, వెంట్రుకలు కూడా బలహీనంగా మారి విరిగి పోవడం లేదా ఊడిపోవడం మొదలు అవుతుంది. ఎవరి జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటాడో.. వారు మాట్లాడేటప్పుడు తడబడతారు. చెల్లి, అత్తతో సంబంధాలు చెడిపోతాయి. కష్టపడి పనిచేసినా.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం సాధించలేరు. వ్యాపారంలో నష్టం వస్తుంది. సమాజంలో హోదా, ప్రతిష్ట తగ్గుతాయి. వీరికి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండదు.

ఇవి కూడా చదవండి

బుధుడి బలోపేతం కోసం చేయాల్సిన చర్యలు

  1. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు విష్ణువును ధ్యానించాలి.
  2. బుధవారం గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఈ రోజున ఉపవాసం ఉండండి.
  3. బుధవారం రోజున ఆవులకు పచ్చ గడ్డి, ఆహారం తినిపించండి.
  4. పచ్చ రత్నం ధరించండి.
  5. ట్రాన్స్ జెండర్ల బట్టలు,యు ఆకుపచ్చ గాజులు దానం చేయండి.
  6. తులసి మొక్కకు నీరు పోసి.. పూజించండి.
  7. బుధవారం తులసి దళాలను తినండి
  8. ఆలయంలో పాలు, బియ్యం దానం చేయండి.
  9. బుధవారం మాంసం, గుడ్లు, మద్యం వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు