
జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగే ఆషాఢ మాసంలో కొన్ని రాశుల వారికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగడానికి అవకాశాలున్నాయి. రవి, బుధ, గురు, కుజుల అనుకూలత వల్ల కొన్ని సమస్యలు, వివాదాలు పరిష్కారం కావడంతో పాటు, ఆదాయం పెరగడం, ఆస్తులు కలిసిరావడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరిగే సూచనలున్నాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు అవకాశం లేనప్పటికీ, ఇతరత్రా మాత్రం అనుకూలతలు బాగా పెరిగే అవకాశముంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి ఓ నెల రోజుల పాటు నిత్యకల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోతుంది.
ఈ రాశికి ఆషాఢ మాసమంతా గురు, శుక్ర, బుధుల వంటి సహజ శుభ గ్రహాలు బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గి ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి, సుఖ శాంతులు ఏర్పడడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శుభ పరి ణామాలతో సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, రవి, శనుల అనుకూలత బాగా పెరిగినందువల్ల కొన్ని ఊహిం చని శుభ యోగాలు, రాజ యోగాలు కలుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు, అదనపు రాబడి ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.
ఈ రాశివారికి ఆషాఢ మాసమంతా గురు, కుజ, శుక్ర, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉంటు న్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో మంచి పదోన్నతికి అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది.
రాశ్యధిపతి రవితో పాటు బుధ, శుక్రులు, కుజ, రాహువులు కూడా అనుకూలంగా మారడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బిజీగా సాగు తాయి. కలలో కూడా ఊహించని పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి.
ఈ రాశికి ఆషాఢ మాసమంతా దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉండడం వల్ల ప్రతి ప్రయ త్నంలోనూ విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఈ రాశికి సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం జరుగుతున్నందు వల్ల ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించడం జరుగుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంది. విదేశీ ప్రయ త్నాలు, విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు అందడమే కాక, సంపద కూడా లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కా రమవుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.