Telugu News Astrology April 3–14 Planetary Warning: Mars, Saturn, Sun Conjunction in Pisces Signals Risky Phase for 6 Zodiac Signs
వారికి ధన నష్టాలు, నమ్మక ద్రోహాలు..! పాప గ్రహాల యుతితో జాగ్రత్త..
ఏప్రిల్ 3 నుంచి 14 వరకు మీన రాశిలో కుజ, శని, రవుల సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరం. ఈ కాలంలో అహంకారం పెరగడం, అధికార దుర్వినియోగం, వాహన ప్రమాదాలు, ధన నష్టాలు, మోసాలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మీన రాశుల వారు ఈ 10 రోజులు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఏప్రిల్ 3 నుంచి 14 వరకు మీన రాశిలో కుజ, శని, రవులు సంచారం చేయబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మూడు గ్రహాలు అత్యంత పాపగ్రహాలు గుర్తింపు పొందాయి. ఈ పాప గ్రహాలు ఒక రాశిలో కలవడమనేది ఏమంత మంచిది కాదు. కొన్ని రాశులవారు తమ అధికారాలను అతిగా వినియోగించడం, అహంకారం పెరగడం వంటివి జరుగుతాయి. వాహన ప్రమాదాలు, నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు, మోసాలు వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మీన రాశుల వారు ఓ పది రోజుల పాటు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
మేషం: వ్యయ స్థానంలో రాశినాథుడు కుజుడితో శని, రవులు చేరడం వల్ల భారీగా ధన నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. బాగా సన్నిహితుల ద్వారా మోసపోవడం జరుగుతుంది. వాహన ప్రమాదాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇష్టం లేని ప్రాంతానికి లేదా దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో వాగ్వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా సమస్యలు తలెత్తుతాయి. అధికారులతో అపార్థాలు చోటు చేసుకోవడం, విధి నిర్వహణలో పొరపాట్లు జరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నవారు అతిగా తమ అధికారాలను ఉపయోగించడం, సమ స్యల్లో చిక్కుకోవడం జరుగుతాయి. కుటుంబ జీవితంలో టెన్షన్లు పెరుగుతాయి. కొందరితో సన్ని హిత సంబంధాలు దెబ్బతింటాయి. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.
సింహం: అష్టమ శని దోషం ఒకపక్క, రాశ్యధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడం మరోపక్క, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు అష్టమ స్థాన సంచారం మరో పక్క ఈ రాశివారిని కష్టనష్టాల పాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు ఓ పది రోజుల పాటు ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఈ రాశివారికి రహస్య శత్రువులు తయారవుతారు. ఆరోపణలు, విమర్శలు, చెడు ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఏ పనీ ఒక పట్టాన కలిసిరాదు.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో మూడు పాప గ్రహాలు చేరడం వల్ల వాహన ప్రమాదాలకు, అనుకోని అనారోగ్యాలకు, శత్రువులు పెరగడానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదరకపోవచ్చు. ప్రేమ వ్యవ హారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది.
తుల: ఈ రాశికి షష్ట స్థానంలో శని, కుజ, రవులు కలవడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బాగా నష్టపోయే అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు, వాగ్దానాలు, హామీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆహార, విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిత్రులు శత్రువులుగా మారతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు.
మీనం: ఈ రాశిలో మూడు పాప గ్రహాలు సంచరించడం ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమంత మంచిది కాదు. అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంది. ఆదాయంలో ఎక్కువ బాగా వృథా అయ్యే అవ కాశం ఉంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అధికారుల నమ్మకానికి దూరమవు తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అడ్డంకులు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు చేజారుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.