Astrology Tips: కలబందతో అందం మాత్రమే కాదు.. ఇలా చేస్తే అదృష్టం కూడా మీ వెంటే..

|

Nov 26, 2022 | 8:32 PM

ఈ మొక్క కేవలం అందం, ఆరోగ్య సంరకణకు మాత్రమే కాదు..కలబందను అదృష్ట మొక్కగా కూడా చెబుతారు. అంటే ఈ మొక్కను ఇంటి లోపల పెంచుకుంటే..

Astrology Tips: కలబందతో అందం మాత్రమే కాదు.. ఇలా చేస్తే అదృష్టం కూడా మీ వెంటే..
Aloe Vera
Follow us on

కలబంద ప్రయోజనాలు: కలబంద నేడు అందం, ఆరోగ్య సంరక్షణ కోసం విస్తృతంగా ఉపయోగించే మొక్క. కలబంద అనేక ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన మొక్క. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే ఈ మొక్కను ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు. అలోవెరా జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్‌కి స్టోర్‌హౌస్‌. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ పనితీరును సక్రమంగా నిర్వహించడంలో, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. కలబంద చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. వేసవిలో ఎండ వేడిమి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి అలోవెరా జెల్ ఒక అద్భుతమైన రెమెడీ.

ఒత్తైన, జాలువారే జుట్టు కోసం అలోవెరా జెల్ ను తలకు,యు జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

కానీ ఈ మొక్క చైనీస్ ఆర్కిటెక్చర్ ఫెంగ్ షుయ్ ప్రకారం.. అందం సంరక్షణ, ఆరోగ్యానికి మాత్రమే కాదు..కలబందను అదృష్ట మొక్కగా కూడా చెబుతారు. అంటే ఈ మొక్కను ఇంటి లోపల పెంచుకుంటే రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద అనేది చెడు శక్తిని బయటకు పంపిస్తుంది. ఆ ఇంట్లో సానుకూల వైబ్‌ను కలిగిస్తుంది. ఆ ఇంటి యజమానులకు అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో మురికి గాలి ఉంటే, దానిని శుభ్రం చేయడానికి కలబంద సహాయపడుతుంది. మీరు ఇంటి చుట్టూ కలబందను నాటాలనుకుంటే, తూర్పు లేదా ఉత్తర దిశలో మొక్కను నాటడం ఉత్తమమని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి