Vinukonda: నడిరోడ్డుపై 2 చేతులు తెగనరికి.. వామ్మో.. దారుణ హత్య..

వినుకొండలో దారుణ హత్య స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. షేక్‌ జిలాని అనే వ్యక్తి.. కొబ్బరి బొండాల కత్తితో రషీద్‌ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా నరికాడు. దీంతో రషీద్ తీవ్ర గాయాలతో మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Vinukonda: నడిరోడ్డుపై 2 చేతులు తెగనరికి.. వామ్మో.. దారుణ హత్య..
Rashid - Jilani
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 18, 2024 | 8:32 AM

దారుణం, ఘోరం, భయానకం… పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్‌ గురించి చెప్పడానికి ఈ పదాలేవీ సరిపోవు. అంత దారుణంగా, భయానకంగా ఈ హత్య జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్‌ను కత్తితో తెగనరికాడు ప్రత్యర్థి జిలానీ. వినుకొండ బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన ఈ దారుణ మర్డర్‌ను లైవ్‌లో చూశారు అక్కడి ప్రజలు. నరికేటప్పుడే కాదు… ఆ తర్వాత కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. రషీద్‌పై ఒక్కసారిగా దాడి చేశాడు జిలానీ. తనతో తెచ్చుకున్న కత్తితో ముందు చేతులపై నరికాడు. ఒక చెయ్యి రోడ్డుపైనే తెగిపడింది. ఆ తర్వాత మరో చెయ్యిపై వేటు వేశాడు. ఆవెంటనే తల, మెడపై వేటు వేయడంతో రషీద్‌ కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రషీద్‌ రక్తపుమడుగులో రోడ్డుపై పడిఉన్నాడు. కొన ఊపిరి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రషీద్‌.

రషీద్‌ను విచక్షణారహితంగా నరికిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు జిలానీ. పక్కా ప్లాన్‌తోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తి ఎక్కడ నుండి సేకరించాడు, దాడి వెనుక జిలానికి సహకరించింది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ మర్డర్‌ వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్టు చెప్పారు పల్నాడు ఎస్పీ. ఈ హత్య వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకు కనిపించలేదన్నారు. ఇక, వినుకొండలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు పల్నాడు ఎస్పీ.

వినుకొండ మర్డర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది వైసీపీ. సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..