విజయసాయిరెడ్డి విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారం, భీమిలిలో పీలా గోవింద్‌ సోదరులు 150 ఎకరాలు కబ్జా చేశాంటూ ఆరోపణలు

విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు ఫుల్ బిజీ అయిపోయారు. పెందుర్తి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు,..

  • Venkata Narayana
  • Publish Date - 3:29 pm, Tue, 2 March 21
విజయసాయిరెడ్డి విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారం,   భీమిలిలో పీలా గోవింద్‌ సోదరులు 150 ఎకరాలు కబ్జా  చేశాంటూ ఆరోపణలు

విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు ఫుల్ బిజీ అయిపోయారు. పెందుర్తి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అదీప్ రాజ్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పర్యటించారు. భీమిలిలో పీలాగోవింద్‌ సోదరులు 150 ఎకరాలు కబ్జా చేశారని ఈ సందర్బంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. పెందుర్తి కూడలి సభలో ఆయన ప్రసంగించారు. ఆక్రమణకు గురైన భూమిలో 50 ఎకరాలు వెంటనే స్వాధీనం చేసుకున్నామని.. సబ్బవరం మండలంలో కబ్జా అయిన 200 ఎకరాలను కూడా కోర్టు అనుమతితో స్వాధీనం చేసుకుని..పేదలకు పంచుతామన్నారు. ఇలాంటి కబ్జారాయుళ్లకు ప్రజలు ఓటేయొద్దని విజయసాయి పిలుపునిచ్చారు.

Read also : GVMC Elections : జీవీఎంసీ ఎలక్షన్ టైం, ఫ్రీగా మందుపోయాలంటూ బార్ల యజమానులకు బెదిరింపులు, ఎస్ఈసీకి ఫిర్యాదు