GVMC Elections : జీవీఎంసీ ఎలక్షన్ టైం, ఫ్రీగా మందుపోయాలంటూ బార్ల యజమానులకు బెదిరింపులు, ఎస్ఈసీకి ఫిర్యాదు

GVMC Elections : విశాఖ నగరంలోని బార్ యజమానులను అధికార వైసీపీ ఎన్నికల నిమిత్తం పది లక్షల రూపాయల విలువచేసే మద్యాన్ని ఉచితంగా ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విశాఖ టీడీపీ..

GVMC Elections :  జీవీఎంసీ ఎలక్షన్ టైం, ఫ్రీగా మందుపోయాలంటూ బార్ల యజమానులకు బెదిరింపులు, ఎస్ఈసీకి ఫిర్యాదు
Follow us

|

Updated on: Mar 02, 2021 | 2:51 PM

GVMC Elections : విశాఖ నగరంలోని బార్ యజమానులను అధికార వైసీపీ ఎన్నికల నిమిత్తం పది లక్షల రూపాయల విలువచేసే మద్యాన్ని ఉచితంగా ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విశాఖ టీడీపీ నేతలు SEC కి ఫిర్యాదు చేశారు. అటు, పలాస మున్సిపాలిటీలో పార్టీ ఫిరాయించిన నలుగురు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలు కూనా రవి కుమార్, గౌతు శిరీష నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. బార్ యజమానులను ఎన్నికల కోసం ఉచిత మద్యం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనీ అందిన టీడీపీ ఫిర్యాదును సీరియస్ గానే పరిగణిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. దీనిపై ఎవరైనా ముందుకొచ్చి తగిన సాక్ష్యాలు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో 80శాతం దాటిన పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు ఊతం ఇచ్చిందని నిమ్మగడ్డ తెలిపారు. విశాఖలో ఓటర్ల లిస్టు పంపిణీ చేయడం కొంత కష్టమైన వ్యవహారమే అయినా… 7వ తేదీ నాటికి పూర్తి చేయాలనీ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి తమకు ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదని నిమ్మగడ్డ చెప్పారు.

ఇదికూడా చదవండి : Andhra University VC : కులసంఘం సమావేశానికి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి హాజరవడంపై ఫిర్యాదులు, ఎస్ఈసీ కన్నెర్ర