మావిగన్‌ నినాదం తెరమీదకు ఎందుకు వచ్చింది? టీవీ9 క్రాస్‌ఫైర్‌‌లో మిథున్‌ రెడ్డి కీలక వ్యాఖ్యల

Updated on: Apr 11, 2026 | 6:50 PM

మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా? మరి సొంత పార్టీ నేతలకు జగన్‌ సమాధానం చెప్పగలరా.. ధర్మాన, రోజా వంటి నేతలు ప్రాంతీయవాదాలు తెరమీదకు తీసుకువస్తున్నారా? వైసీపీని ప్రజలు కూడా నమ్మడం లేదా.. అందుకే మావిగన్‌ నినాదం తెరమీదకు వచ్చిందా? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి రాజధాని అమరావతిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

వైసీపీ విధానపరంగానే అమరావతిని వ్యతిరేకిస్తుందా.. అందుకే పార్లమెంట్‌లో వాకౌట్‌ చేసిందా? ఎంపీల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇది మైనస్‌గా మారిందా.. ఇదే అంశంపై ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా? వైసీపీని ప్రజలు కూడా నమ్మడం లేదా.. అందుకే మావిగన్‌ నినాదం తెరమీదకు వచ్చిందా? అనే అంశాలపై టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్‌ రెడ్డి రాజధానిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

అలాగే మాజీ సీఎం జగన్‌ పార్టీలోకి ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఆయన చెప్పింది వినడమే తప్ప.. పార్టీ నాయకుల మాట ఆయన వినేది ఉండదా? తలాడించడమేనా? దానిపై మిథున్ రెడ్డి ఆసక్తికర అంశాలు బయటపెట్టారు. వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డితో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఇంటర్వ్యూ ఫుల్‌ ఎపిసోడ్‌ ఈ రోజు (శనివారం, ఏప్రిల్ 11) రాత్రి7.30గంటలకు ప్రసారం అవుతుంది. వాచ్‌ ఆన్‌ టీవీ9.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Apr 11, 2026 06:48 PM
Follow Us