Andhra Pradesh: ఏపీలో 20 నుంచి 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

|

Dec 17, 2023 | 4:21 PM

రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని.. అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని.. అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని.. వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవటం కోసం కోట్ల రూపాయల ఖర్చు పెట్టారని.. వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పని చేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ న్యాయవాదులకు అండగా ఉన్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్టు అన్నారు. లా నేస్తం ద్వారా లాయర్లకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని APSFL ఛైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుందతీ వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ చేరుస్తున్న దొంగ ఓట్లపై కూడా లీగల్ గా పోరాటం చేయాలి వైసీపీ నేతలు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..