Andhra Pradesh: జగన్‌ను హతమార్చే కుట్ర జరుగుతోంది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

|

Dec 11, 2021 | 2:11 PM

అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని

Andhra Pradesh: జగన్‌ను హతమార్చే కుట్ర జరుగుతోంది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Follow us on

అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని.. టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనను హత్యచేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందన్నారు. జగన్ గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అనంతపురం జిల్లా మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, అంబటిలను చంపితే రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు అంటున్నారు. ఎక్కడో చెబితే అనంతపురంలో ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇదే టీడీపీ విధానమా? అలా కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టీడీపీ నేతలెవరూ మల్లాది వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? హింసా రాజకీయాలకు కేరాఫ్‌గా టీడీపీ, స్కాంలకు కేరాఫ్‌గా చంద్రబాబు మారారు. చంద్రబాబు పాలనలో వేల కోట్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయింది. ఇది అబద్ధమైతే సీఐడీ విచారణకు ఆ పార్టీనేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో వివరించాలి. జగన్ ను హత్య చేసైనా అధికారంలోకి చేజిక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది.’ అని ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు.

Also Read:

Lance Naik Sai Teja: సాయితేజ కుటుంబానికి పరిహారాన్ని అందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఆదుకుంటామని హామీ.!

Kitty Party: కిట్టీ పార్టీ కథా చిత్రమ్.. ఇప్పుడిది ఆటవిడుపు కాదు.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు

Wonderful Nest: పురుగు పెట్టిన అద్భుతమైన గూడు.. చూస్తే ఔరా అనక మానరు..!