Andhra Pradesh: కిక్కు కిక్కే.. దసరా పండగంటే ఇదే గురూ.. కోడి, క్వార్టర్ మందు బాటిల్.. వీడియో చూడండి..

దసరా అంటే సాధారణంగానే ఒక కిక్కు. ఏ పండగకి లేనంతగా దసరా పండుగకు అంత సందడి నెలకొంటుంది. ఇదే రోజు.. ముక్క.. చుక్క ఉండాల్సిందే. అంతేకాకుండా మామూళ్ళకి ఒక రేంజ్‌లో లెక్క ఉంటుంది. తమ వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి హోదాలతో సంబంధం లేకుండా అందరికీ దసరా మామూలు అని ఆయా యజమానులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంటుంది.

Andhra Pradesh: కిక్కు కిక్కే.. దసరా పండగంటే ఇదే గురూ.. కోడి, క్వార్టర్ మందు బాటిల్.. వీడియో చూడండి..
Dussehra Gift

Edited By:

Updated on: Oct 25, 2023 | 4:39 PM

విశాఖపట్నం, అక్టోబర్ 25: దసరా అంటే సాధారణంగానే ఒక కిక్కు. ఏ పండగకి లేనంతగా దసరా పండుగకు అంత సందడి నెలకొంటుంది. ఇదే రోజు.. ముక్క.. చుక్క ఉండాల్సిందే. అంతేకాకుండా మామూళ్ళకి ఒక రేంజ్‌లో లెక్క ఉంటుంది. తమ వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి హోదాలతో సంబంధం లేకుండా అందరికీ దసరా మామూలు అని ఆయా యజమానులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంటుంది. హోదాలను బట్టి బహుమతులు ఉంటుంటాయి. ఇంటి దగ్గర పని చేసే శానిటరీ వర్కర్, విద్యుత్ లైన్ మెన్ దగ్గర నుంచి పాలు తెచ్చి ఇచ్చేవాళ్ళు, బట్టలను ఐరన్ చేసే వాళ్ళు.. ఒకరేంటి ప్రతి ఒక్కరికి దసరా మామూళ్లను ప్రేమతో ఇస్తుంటారు. అలా ఇచ్చే మామూళ్లలో కిక్ ఉండాలి అని అనుకున్నారు.. విశాఖపట్నంలోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు.. దాంతో అందరికీ కిక్కిచ్చే విధంగా ఓ బతికున్న కోడితోపాటు, ఒక క్వార్టర్ మందు బాటిల్ ను దసరా మామూలుగా ఇచ్చి ఆయా వర్గాల ప్రజల మన్ననలను అందుకున్నాడు.

విశాఖ సౌత్ నియోజకవర్గ వైసీపీ మండల అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్.. దసరా పండుగ నాడు కిక్ ఇచ్చే దసరా మామూళ్లను అందించారు. బతికి ఉన్న కోడి, క్వాటర్ బ్రాందీ బాటిళ్లను దాదాపు 1000 మందికి పంపిణీ చేశారు. 31వ వార్డులో జరిగిన ఈ కిక్ కానుకల కోసం స్థానిక ప్రజలు క్యూ కట్టారు. బహుమతులు ఇచ్చే సమయంలో తమ ప్రాంత ఎమ్మెల్యే సాక్షిగా అన్నట్టు.. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్లెక్సీని కట్టి, దాని ముందు కానుకలను దొడ్డి బాపు ఆనంద్ పంపిణీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు రాకముందే.. ఇలాంటి హాడావుడి చూసి .. అందరూ నేతల ముందు.. ‘మందు’ చూపు.. అంటూ పేర్కొంటున్నారు. ఇలా విశాఖపట్నంలో మందు, కోడి గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..