AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 నుంచి 22 మంది అభ్యర్థులతో మూడో జాబితా.. జోగి రమేష్‌కు పెనమలూరు సీటు ఖరారు!

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలోని నాయకులకు ఆందోళన కలుగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతూనే ఉన్నారు. ఈ రోజు నేతలతో చర్చించిన తరువాత కొత్త ఇన్​ఛార్జ్​ల జాబితా జగన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

20 నుంచి 22 మంది అభ్యర్థులతో మూడో జాబితా.. జోగి రమేష్‌కు పెనమలూరు సీటు ఖరారు!
YS Jagan
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2024 | 5:42 PM

Share

వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితాపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 20 నుంచి 22 మంది అభ్యర్థులతో కాసేపట్లో మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి..వైసీపీ వర్గాలు. పలు స్థానాల విషయంలో లాస్ట్‌మినిట్‌లో చర్చలు జరుగుతున్నాయి. జోగి రమేష్‌కు పెనమలూరు సీటును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లి..అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు.. మంత్రి జోగి రమేష్. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. రేపు ఆయన చంద్రబాబుతో భేటీ అవ్వనున్నారు. మరోవైపు క్యాంప్‌ ఆఫీసుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేల క్యూ కట్టారు. కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంజీవయ్యలు సీఎం జగన్‌ను కలిశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మూడో లిస్ట్‌లో పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. అటు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి టికెట్ లేదన్న ప్రచారంతో ఆయన అలక పూనినట్లు తెలుస్తుంది. సీఎంవో కాల్స్ కూడా ఆయన లిఫ్ట్ చేయనట్లు చెబుతున్నారు.  ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి వ్యవహారంపై ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డితో జగన్ చర్చలు జరిపారు. కీలక నేతలైన మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు తాడేపల్లి వచ్చి జగన్​తో భేటీ అయ్యారు. సీట్ల కసరత్తులో ప్రకాశం జిల్లా సీట్లపై కసరత్తును జగన్ కొద్దికాలం పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది.

వై నాట్ 175 లక్ష్యాన్ని చేరాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. అందుకే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పనితీరుపై వేర్వేరు సర్వేలు చేయిస్తోంది. రిపోర్ట్‌ల ఆధారంగా ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. ఈ రెండు లిస్టుల్లో 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. 13 మంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించగా.. 25 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చింది. ప్రధానంగా రెండు జాబితాల్లో విశాఖ, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా మార్పులు కనిపించాయి. మూడో జాబితాపై అధిష్టానం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ఎమ్మెల్యేలను క్యాంప్‌ ఆఫీస్‌కు పిలిచి వాస్తవ పరిస్థితిని వివరించింది. మార్పులు తప్పవని అందుకు సన్నద్ధం కావాలని సూచించింది. ఫైనల్‌గా 29మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. అయితే నిన్న ఆఖరి నిమిషంలో లిస్ట్ రిలీజ్ వాయిదా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…