AP: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన, సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగన్న తోడు పథకం దేశానికే దిక్సూచి అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు..

ఆంధ్రప్రదేశ్‌లో 8వ విడత జగనన్న తోడు పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో గురువారం సీఎం జగన్ బటన్ నొక్కి, జగనన్న తోడు పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగన్న తోడు పథకం దేశానికే దిక్సూచి అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వాళ్లు నిలదొక్కుకునేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. పీఎం స్వనిధి కంటే.. జగనన్న తోడు పథకం కింద అధిక నిధులు విడుదల చేశామని చెప్పుకొచ్చారు.
ఇక నిధుల విషయానికొస్తే.. రాష్ట్రంలో మొత్తం 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు, అంతకుపైన కలిపి మొత్తం, 417కోట్ల 94 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు అందించామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారని ఆయన అన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు.. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని సీఎం జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్ వ్వవస్థ వల్లే రుణాలు ఇప్పించి, తిరిగి రుణాలు కట్టించడం సాధ్యమయ్యాయని సీఎం తెలిపారు.
ఇదిలా ఉంటే జగనన్న తోడు పథకంలో భాగంగా నిరుపేదలైన చిరు వ్యాపారుల అవసరాలకు వడ్డీ లేకుండా ఏపీ ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. ఇక రుణాలు సకాలంలో చెల్లించినవారికి ఏడాది మరో రూ. 1000 చొప్పు జోడిస్తూ.. రూ. 13,000 వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..