
సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి పునర్వవైభవం తీసుకువచ్చే దిశగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పర్యటించి, ఏపీలో పట్టు నిలుపుకునేందుకు పార్టీ నేతలను కార్యకర్తలను ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫలితాల తర్వాత ఆయా లోటుపాట్లను సరిదిద్ది, నూతన ఉత్సాహంతో ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది వైసిపి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కార్యకర్తల్లో నేతలు అంతా చెల్లా చదురవడంతో వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలను భుజానికి వేసుకున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు నెలల్లోనే కొత్త జిల్లా కమిటీలు,కొత్త అధ్యక్షులు,నూతన నియోజకవర్గ సమన్వయ...