YS Jagan: వారంతా అందుకే వచ్చారు.. గతంలో పవన్, లోకేష్ నన్ను తిట్టలేదా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు... ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీస్‌, కార్లు, ఇంటిని జగన్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

YS Jagan: వారంతా అందుకే వచ్చారు.. గతంలో పవన్, లోకేష్ నన్ను తిట్టలేదా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..
Ys Jagan

Updated on: Feb 04, 2026 | 7:11 PM

వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.. ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీస్‌, కార్లు, ఇంటిని జగన్ పరిశీలించారు. ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో అంబటి ఇల్లు, ఆఫీస్, కార్లు ధ్వంసం అయ్యాయి. అన్నింటినీ పరిశీలించిన జగన్.. దాడి ఘటనపై అంబటి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేశారని జగన్ ఆరోపించారు.. బూతులు తిడుతూ అంబటి రాంబాబు మీదకు వెళ్లారన్నారు.

అంబటిని చుట్టుముట్టిన సందర్భంలో ఆవేశంలో ఆయన నోరుజారారని జగన్ పేర్కొన్నారు. నోరు జారినందుకు చింతిస్తున్నా అని..అంబటి ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారని జగన్ పేర్కొన్నారు. గతంలో పవన్, లోకేష్ నన్ను తిట్టలేదా.. అంటూ జగన్ ప్రశ్నించారు. అంబటిని హత్య చేయడానికే ఇంటి మీదకు వెళ్లారని ఆరోపించారు. దాడి చేసిన వారి మీద చిన్న కేసులు పెట్టి.. అంబటి రాంబాబును జైలుకు పంపించారని జగన్ పేర్కొన్నారు. రజినీ మీద కూడా దాడి చేసి.. తిరిగి ఆమె మీదనే కేసు పెట్టారని జగన్ పేర్కొన్నారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారన్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఆరోపించారు. దేవుడంటే భయం భక్తి లేకుండా.. రాజకీయాలకు వాడుకున్నారని జగన్ పేర్కొన్నారు.

తాడేపల్లి నుంచి ఉదయం 11గంటలకు బయల్దేరిన జగన్ సాయంత్రం వేళ అంబటి నివాసానికి చేరుకున్నారు. దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా రావడంతో పర్యటన ఆలస్యమైంది. మార్గ మధ్యలో జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చాలా చోట్ల కార్యకర్తలు చుట్టుముట్టడంతో కాన్వాయ్ ఆపి అభివాదం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us