
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు మాజీ సీఎం జగన్. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటించారు. ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే అని.. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.