YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఇవాళ సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి..

|

Jan 28, 2023 | 7:51 AM

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకు..

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఇవాళ సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి..
Ys Viveka Murder Case
Follow us on

దివంగత మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు సైతం జారీ చేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు. వివేకా హత్యకేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో అవినాష్ రెడ్డిని విచారించనున్నారు సీబీఐ అధికారులు.

ఈనెల 24నే విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రొగ్రామ్స్ రీత్యా… ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని, కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తానని సీబీఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి. దీంతో… ఈనెల 25న సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకుని ఈనెల 28న విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. వివేకా హత్యకేసులో ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..