VSP Coins Bike: తనకు సొంతం బైక్ కావాలని.. ప్రతి యువకుడూ కలకంటాడు. అయితే కొంతమంది తమ కలను తీర్చుకోవడనికి కొంచెం కష్టమైనా ఇష్టంగా పడతారు. అదీ బైక్ మీద నేటి యువతకు ఉన్న మోజు.. త్త బైక్ కొనాలి అ౦టే…షోరూమ్ కి వెల్లి, ఫైనాన్స్ కిందో లేదా ఏ చెక్కో, క్యాషో చెల్లించో తీసుకోవడం సహజం. కాని విశాఖ గాజువాకకు (Gajuwaka) చెందిన సింహాద్రి(Simhadri) అలా తీసుకుంటే థ్రిల్ ఏము౦టు౦ది అనుకున్నాడు.తాను బైక్ కొనట్లు అ౦తటా ఓ పెద్ద చర్చ జరగాలనుకొన్నాడు. అనుకున్నట్టుగానే అతను బైక్ కొనడం.. అది కాస్త పెద్ద చర్చకు దారితీయట౦ జరిగి౦ది. ఇ౦తకీ సి౦హాద్రి బైక్ కొనటంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా..
ఇతని పేరు సింహాద్రి. విశాఖ గాజువాక వాసి. కిక్ సినిమాలోని రవితేజ మాదిరిగా తాను ఏ పని చేసిన దానలో థ్రిల్ ఉండాలని భావిస్తాడు. యువకుడు కావడంతో అందరి కుర్రాళ్లలాగే బైక్ మీద మనసు పడ్డాడు సింహాద్రి. రె౦డేల్ల కిందట నుండి బైక్ కి కావలసిన డబ్బులు సమకూర్చుకునే పనిలోపడ్దాడు. మొత్తానికి డబ్బులు సంపాదించాడు. అయితే అందరిలాగ షోరూమ్ కి వెళ్లామా, డబ్బులిచ్చి బైక్ తెచ్చుకున్నామా అన్నట్టుగా కాకుండా తను బైక్ కొనడం అందరికీ గుర్తుండి పోవాలని భావించాడు. దాని కోసం వినూత్నంగా ఆలోచించాడు. లక్షా అరవై రూపాయలు విలువ చేసే బైక్ కి నగదు మొత్తం రూపాయి కాయిన్స్ రూపంలోనే చెల్లించి షో రూమ్ వారికి థ్రిల్ ఇచ్చాడు.
అయితే లక్షా అరవై వేల రూపాయలకు సమాన౦గా రూపాయి కాయిన్స్ సేకరించే౦దుకు దాదాపు మూడు నెలలు శ్రమపడ్డాడు సింహద్రి. లక్షా ముప్పై వేల రూపాయిల కాయిన్లను విశాఖ నగరంలోని వివిధ బ్యాంకుల నుంచి సంపాదించగా మిగిలిన 30 వేల రూపాయిల కాయిన్స్ ఇ౦టిలో దాచుకున్నవి.
కాయిన్స్ చెల్లించి బైక్ తీసుకువెళ్లాలన్న కాన్సెప్ట్ పై మొదట షోరూమ్ ప్రతినిధుల నుండి నిరాకరణ ఎదురైంది.అయితే సింహాద్రి తన కాన్సెఫ్ట్ ని వారికి చెప్పి ఒప్పంచట౦తో చివరకు అ౦గీకరి౦చారు.దా౦తో ఆరుగురు యువకులు కాయిన్స్ మూటలను మోసుకు౦టూ షోరూమ్ తీసుకువచ్చారు.
మొత్తానికి కొత్త బైక్ ని కొని ఆనందం సింహాద్రి సొంతమైతే వచ్చిన కాయిన్స్ ని లెక్క పెట్టటంలో ఇబ్బందులు పడ్డారు షోరూ నిర్వాహకులు. లక్ష 60 వేల రూపాయిలను 10 మ౦ది సిబ్బంది ఆరు గ౦టల పాటు శ్రమి౦చి లెక్క కట్టారు.
Also Read: Vizag Steel Plant: ప్రారంభమైన స్టీల్ ప్లాంట్ ఎన్నికలు… బారులు తీరిన కార్మికులు.. రాత్రికి రిజల్ట్