Andhra Pradesh: లైక్‌ల కోసం కక్కుర్తి.. పోలీస్‌లను కూడా వదలని పోకీరీలు..

| Edited By: Narender Vaitla

Jan 09, 2024 | 6:51 PM

వివరాల్లోకి వెళితే.. కొందరు అసాంఘిక శక్తులు పోలీసు వాహనాలను సైతం వదలడం లేదు. సోషల్ మీడియాలో నయ ట్రెండ్ అవ్వాలి, సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోడానికి పోలీసుల వాహనాలను వాడుకుంటూ.. రీల్స్, ఫోటోలతో యువత భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయవాడ నగరంలో..

Andhra Pradesh: లైక్‌ల కోసం కక్కుర్తి.. పోలీస్‌లను కూడా వదలని పోకీరీలు..
Follow us on

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్‌ సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఎలాగైనా వైరల్‌ అవ్వాలి, లైక్‌లు రావాలని ఇదే లక్ష్యం. అందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. చివరికి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో పోకీరీలు ఏకంగా పోలీసుల వాహనాలను కూడా వద్దల్లేదు.

వివరాల్లోకి వెళితే.. కొందరు అసాంఘిక శక్తులు పోలీసు వాహనాలను సైతం వదలడం లేదు. సోషల్ మీడియాలో నయ ట్రెండ్ అవ్వాలి, సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోడానికి పోలీసుల వాహనాలను వాడుకుంటూ.. రీల్స్, ఫోటోలతో యువత భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయవాడ నగరంలో యువకులు చేసిన పని చర్చకు దారి తీసింది. అర్హత కలిగిన ఉన్నత అధికారి కుర్చునే స్థానంలో, ఆకాతయిలు సెల్ఫీలు దిగుతూ చేసిన రచ్చ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

విజయవాడలో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధి రాణి గారితోటలో ఈ నెల 6వ తేదీన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే రక్షక్‌ వాహనాన్ని సెంటర్‌లో ఆపి వెళ్లారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఉస్తేల రామయ్య, అతడి స్నేహితుడు సిబ్బంది లేని విషయాన్ని గమనించి వాహనాన్ని ఎక్కి, ఇంఛార్జ్ అధికారి సీట్‌లో కూర్చొని సెల్ఫీలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోమవారం నెట్టింట వైరల్‌ అయ్యాయి.

అసాంఘిక శక్తులు పోలీస్‌ వాహనంపై కూర్చొని సెల్ఫీ దిగడంపై విమర్శలకు దారి తీశాయి. పోలీస్‌ వ్యవస్థపై భయం లేకుండా వ్యవహరించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై సీఐ ఎంవీ దుర్గారావు స్పందించారు. శనివారం రాణిగారితోటలో జరిగిన వైసీపీ నేత అవినాష్‌ పాల్గొన్న ఓ కార్యక్రమానికి.. రక్షక్ వాహనంలో హెడ్‌ కానిస్టేబుల్‌ శివప్రసాద్‌, కానిస్టేబుల్‌ విజయ్‌ వెళ్లారని తెలిపారు. వాహనం సెంటర్లో ఆపారని.. పోలీసులు లేని విషయాన్ని గమనించి ఉస్తేల రామయ్య, అతడి స్నేహితుడు వాహనం ఎక్కి సెల్ఫీలు దిగినట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..