చదువూ సంధ్యలేకుండా వీధుల్లో బండ్లు వేసుకొని జులాయిలా తిరిగే యువత రౌడీయిజం పోకడలు పోతోంది. విజయనగరం జిల్లాలో ఓ ఘటన అందుకు నిదర్శనంగా మారింది. అవును తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే.. నడి రోడ్లపై తిరుగుతూ రౌడీయిజం చెలాయిస్తోంది యువతరం. విలువలు నేర్చుకొని.. సమాజానికి ఉపయోగపడాల్సిన యువరక్తం చిల్లర మల్లర గొడవలతో కాలక్షేపం చేస్తోంది. ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది విజయనగరం జిల్లాలో జరిగిన ఓ ఘటన.
విజయనగరం జిల్లాలో ఎల్ఐసి ఆఫీస్ వద్ద సమన్విత పెట్రోల్ బంక్ లో యువకులు హల్ చల్ చేశారు. బైక్ లో పెట్రోల్ కొట్టించి, డబ్బులు చెల్లించకుండా పరాయ్యేందుకు ప్రయత్నించారు కొందరు యువకులు. పెట్రోల్ బంకు సిబ్బంది యువకుల అరాచకాన్ని అడ్డుకోవడంతో వారిపైనే తిరిగి దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెట్రోల్ బంకులో కొట్టించుకున్న పెట్రోల్‌కి డబ్బులు అడిగినందుకు ఊళ్ళో ఉన్న స్నేహితులందర్నీ బంక్ దగ్గరికి పిలిపించిన యువకులు బంక్ సిబ్బంది పై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పెట్రోల్ బంక్ దగ్గర గలాటా సృష్టించిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బంక్ యాజమాన్యం. దీంతో రౌడీ గ్యాంగ్ పనిపట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..