సీఎం జగన్, మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్!

|

Sep 30, 2019 | 8:08 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నాగులవరంకు చెందిన యువకుడు.. ఆదివారం సీఎం, మంత్రిని తిడుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిని గమనించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నాగులవరంలో […]

సీఎం జగన్, మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్!
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నాగులవరంకు చెందిన యువకుడు.. ఆదివారం సీఎం, మంత్రిని తిడుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిని గమనించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నాగులవరంలో యువకుడ్ని అరెస్ట్ చేసి యర్రగొండపాలెం పోలీసు స్టేషన్‌కి తరలించారు.

ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. టెన్త్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లలో అక్రమాలకు చెక్ పేట్టేందుకే ఈ నిర్ణయమని మంత్రి సురేష్ చెప్పారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష రాసే సమయం రెండున్నర గంటలుగా ఉంది. ఆ సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించామని మంత్రి వెల్లడించారు. పశ్రాపత్రాన్ని చదువుకునేందుకు ఈ అదనపు సమయం ఉపయోగపడుతుందని తెలిపారు సురేష్. ఈ నిర్ణయంపైనే సీఎంను, మంత్రిని సదరు యువకుడు వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.