Andhra Pradesh: న్యూ ఇయర్ రోజున తాగిన మైకంలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. చికిత్స పొందుతూ మృతి..

మహబూబ్ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శివ సర్కిల్లో పెద్ద ఎత్తున యువకులు చేరుకొని మృతదేహంతో ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులతో యువకులు వాగ్వాదం దిగారు. ఈ యువకుడి మరణంతో పట్టణంలో ముందు ముందు ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయేమోనని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Andhra Pradesh: న్యూ ఇయర్ రోజున తాగిన మైకంలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. చికిత్స పొందుతూ మృతి..
Kurnool

Edited By: Surya Kala

Updated on: Jan 04, 2024 | 11:53 AM

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ రోజున గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ యువకుడి మృత దేహంతో నడి రోడ్డు మీద  న్యాయం చేయలాంటూ ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్త సంవత్సరం 2024 కి స్వాగతం చెబుతూ కొందరు యువకులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తప్ప తాగారు. అలా తాగిన మైకంలో ఆ యువకులు లక్ష్మీపేట దగ్గర తమకు ఎదురైనా  మెహబూబ్ అనే యువకుడు పై దాడి చేశారు. విచక్షణా రహితంగా మెహబూబ్ ను దాడి చేశారు. తీవ్ర గాయాలైన మహబూబ్ ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న మహబూబ్ పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో మహబూబ్ కుటుంబ సభ్యులు , స్నేహితులు మహబూబ్ దాడి చేసి మరణానికి  కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మృత దేహాన్ని శివ సర్కిల్లో పెట్టి.. పెద్ద ఎత్తున యువకులు చేరుకొని ధర్నాచేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుతో యువకులు వాగ్వాదం దిగారు. ఈ యువకుడి మరణంతో పట్టణంలో ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని .. ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయేమోనని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..