నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రేమ నెత్తురు చిందింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న అక్కసుతో ప్రేమించిన కావ్యను తుపాకీతో కాల్చి చంపాడు. అది కూడా ఆమె ఇంటికే వెళ్లి. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసి వెళ్తూ వెళ్తూ తానూ కాల్చుకుని చనిపోయాడు. కావ్య, సురేష్. వీళ్లిద్దరిదీ తాటిపర్తి గ్రామమే. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. సురేష్ బెంగళూరులో, కావ్య పూణేలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఇద్దరూ బెంగళూరులో కలిసి ఉద్యోగం చేశారు. ఆరునెలలుగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచీ కావ్యను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ వచ్చాడు సురేష్. కానీ, కావ్యను సురేష్‌కు ఇచ్చేందుకు ఆమె పెద్దలు ఒప్పుకోలేదు. ఇవాళ కూడా పెళ్లి గురించి అడగడానికే వచ్చిన సురేష్.. చేతిలోకి గన్ తీసుకుని ఒక్కసారిగా కావ్యపై తెగబడ్డాడు. దూసుకొచ్చిన ఓ బులెట్‌ను తప్పించుకుందామె. మరో బుల్లెట్ మాత్రం శరీరంలోకి దూసుకెళ్లింది. ఆమెను ఉన్నపళంగా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఉపయోగలేకపోయింది. దారిలోనే చనిపోయింది. ప్రస్తుతం నెల్లూరు GGHలో ఆమె డెడ్‌బాడీ ఉంది.
కావ్యను చంపేసిన తర్వాత సురేష్.. ఓ 2వందల మీటర్ల దూరం వెళ్లాడు. అదే తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఈ గన్‌పై MADE in USA అని ఉంది. సురేష్‌కి గన్ ఎక్కడి నుంచి వచ్చింది. USA మార్క్ ఉన్న గన్ నెల్లూరు జిల్లా తాటిపర్తి దాకా ఎలా వచ్చింది. అక్కడి నుంచి తెప్పించాడా.. నెల్లూరు సమీపంలోనే కొన్నాడా.. ఇవన్నీ మర్డర్, సూసైడ్ వెనుక తేలని అనేక అనుమానాలు.
Also Read: Hyderabad: కంత్రీగాడు.. మాయ మాటలతో ఏకంగా 1000 మంది అమ్మాయిలను ముంచేశాడు..