YCP Plenary 2022: ఏపీలో వైఎస్సార్ సీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు వర్షాలను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్లీనరీ ప్రాంగణమంతా కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది. ఇక ఈ రెండో రోజు ప్లీనరీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్లీనరీలో ప్రకటించారు. జీవితకాలపు అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఇందుకు సభ్యులంతా ఆమోదించారు. ఈ సందర్భంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీని ఆత్మీయ సునామీగా ఆయన అభివర్ణించారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్లీనరీ ప్రాంగణం కార్యకర్తలత నినాదాలతో హోరెత్తిపోతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నేతల ప్రసంగాలను వింటున్నారు. ప్లీనరీ సమావేశాలకు లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారి మొత్తం బస్సులు, కార్లతో నిండిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి