
రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో వ్యుహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలు తెలియని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం డ్రగ్స్ కేసులో తనపేరు రావడంపై తొలిసారి స్పందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రెజిల్ అధ్యక్షుడితో సంబంధాలు.. విశాఖ కంటైనర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆపాదించడం వెనక కుట్ర ఉందని బయటపెట్టారు.
పూర్తి ఇంటర్వ్యూ చూడండి…