Vijaya Saireddy: ఏపీలోని వాలంటీర్ల ఎక్కువ మంది మా మనుషులే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఏడు సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.

Vijaya Saireddy: ఏపీలోని వాలంటీర్ల ఎక్కువ మంది మా మనుషులే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijayasaireddy

Updated on: Apr 11, 2024 | 8:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ తోపాటు శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొని విజయసాయిరెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ వీడి టీడీపీ తరుఫున బరిలోకి దిగుతుండటంతో అతనికి ధీటైన అభ్యర్థి వైసీపీకి దొరుకుతారా అనేది నిన్నటి వరకు వేధించిన ప్రశ్న. అయితే, సీఎం జగన్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. జిల్లాలో ఇంకెవరైనా సరైన అభ్యర్ధి ఉన్నారేమో చూశారు. బయటి వ్యక్తుల పేర్లు కూడా పరిశీలించారు. చివరకు ఇదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. వేమిరెడ్డికి కచ్చితంగా ఓటమిని పరిచయం చేస్తామంటోంది వైసీపీ.

ఈ నేపథ్యంలోనే టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, రాజ్యసభ సభ్యులు విజ‌య‌సాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఏడు సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.

ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవ‌స్థపై ప్రతిప‌క్ష పార్టీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వానికి, జనానికి అనుసంధానకర్తలుగా ఉన్న వాలంటీర్లపై పడి ఏడవడం మానుకోవాల‌న్నారు. కొద్ది మంది తప్ప వాలంటీర్లు మా మనుషులే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ విజయసాయిరెడ్డి. మా మనుషులే అనే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు ఎంపీ. వలంటీర్లు తమ కార్యకర్తలని తానెప్పుడూ చెప్పలేదనీ… మా పార్టీ ప్రభుత్వం నియమించిన వారిగానే చెప్పాననీ క్లారిటీ ఇచ్చారు. అయితే, చాలామంది వలంటీర్లు వైసీపీ అభిమానులుగానే ఉంటారని మరోమారు స్పష్టం చేశారు.

పూర్తి ఇంటర్వ్యూ చూడండి…