Kadapa: రసపుత్ర రజిని గారూ ఇదేం పనండి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన వైఎస్సార్‌సీపీ మహిళా నేత

|

Jan 25, 2023 | 11:28 AM

రసపుత్ర రజినిని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. చరణ్‌సింగ్‌ అనే మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు.. వీరి వద్ద నుంచి పోలీసులు రూ.44 లక్షల విలువగల రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Kadapa: రసపుత్ర రజిని గారూ ఇదేం పనండి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన వైఎస్సార్‌సీపీ మహిళా నేత
Rasaputra Rajini
Follow us on

ఆమె వైసీపీలో చాలా యాక్టివ్. ఎమ్మెల్యే అండ పుష్కలంగా ఉందన్న టాక్. ఇంకేమ్.. ఏకంగా.. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరక్టర్ పోస్ట్ దక్కించుకున్నారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్‌గా జిల్లాలో దుమ్ములేపుతున్నారు. ఆ దర్జా, ఆ ఠీవీ చెప్పతరమా అసలు. అయితే పొరుగు రాష్ట్రంలో పోలీసులకు చిక్కి.. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన రజనిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. రసపుత్ర రజినిని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్. రజని నుంచి 40 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు సుబ్రహ్మణ్యపుర పోలీసులు. అనంతపురంలో తమకు తెలిసిన వ్యక్తుల నుంచి ఈ ఫేక్ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో సర్కులేట్ చేస్తున్నట్లు  పోలీసులు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు.

వైసీపీ రాష్ట్ర స్థాయి మహిళా నేత దొంగనోట్ల కేసులో పోలీసులకు చిక్కడం పెను ప్రకపంనలు రేపుతోంది. ఆమె టర్మ్ ఇటీవల ముగియగా.. మరోసారి పదవిని పునరుద్ధరిస్తూ సర్కార్  ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఈమెపై గతంలో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ ముఠాతో ఎమ్మెల్యేకు సంబంధం ఉందని ఆరోపిస్తోంది స్థానిక టీడీపీ.  ఈ ఫేక్ కరెన్సీ వెనుక ఎవరున్నారో తేలాలని.. సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెబుతుందిఈ ఫేక్ నోట్ల వ్యవహారంతో తనకేం సంబంధం లేదన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఆమె పాత్ర నిజమని తేలితే..  పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. విపక్షాలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.