Peddireddy – Chandrababu : తాను చేయడు- ఒకర్ని చేయనివ్వడు. ఇదే చంద్రబాబు పాటించే రాజకీయ కుటిల నీతి.. అంటూ బాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పలమనేరులో అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన పెద్దిరెడ్డి.. రోడ్డు- షాపింగ్ కాంప్లెక్స్ ను సైతం ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు తన సొంత జిల్లా అయిన చిత్తూరుకు చేసిందేమీ లేదని పెద్దిరెడ్డి విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టులను అనుసంధానించి.. చిత్తూరు జిల్లాకు నీరు తెచ్చే బాధ్యత తీస్కున్నారని.. గండి కోట రిజర్వాయర్ నుంచి జిల్లాకు నీటిని తీసుకొస్తామని మంత్రి రామచంద్రారెడ్డి చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు – మేనిఫెస్టులో 90 శాతం హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహనరెడ్డిదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలాఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలే జరగకూడదని చంద్రబాబు పలువిధాలుగా కుట్రలు, కుయుక్తులు పన్నారని, ఆయన కుట్రలకు ఈ ఘన విజయం చెంప పెట్టు అని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు.
రెండేళ్ళుగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా రంజకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనడానికి ఈ వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also : Somu Veerraju : ఏపీలో చారిత్రక ఆలయాల పరిస్థితి చూస్తే హృదయం ద్రవిస్తోంది : సోము వీర్రాజు