Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి

స్పేస్‌లోకి రివ్వున దూసుకుపోతున్నాం... టెక్నాలజీ విషయంలో జెట్ స్పీడులో ఉన్నాం.. త్వరలో మరో గ్రహంపై కూడా నివాసం ఏర్పరుచుకునే రేంజ్‌కి వెళ్లాం.

Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి
Women dies

Edited By:

Updated on: Dec 19, 2021 | 7:13 PM

స్పేస్‌లోకి రివ్వున దూసుకుపోతున్నాం… టెక్నాలజీ విషయంలో జెట్ స్పీడులో ఉన్నాం.. త్వరలో మరో గ్రహంపై కూడా నివాసం ఏర్పరుచుకునే రేంజ్‌కి వెళ్లాం.. కానీ ఈ మూఢ నమ్మకాలను మాత్రం పేద వర్గాల నుంచి తీసివేయలేకపోతున్నాం. తాజాగా మూఢ నమ్మకంతో వివాహిత ప్రాణం తీశారు బంధువులు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా  నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన రవికి, సన్నితకు రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు కలగలేదు. దీంతో బొడ్డు తాడు తినాలంటూ బంధువులు ఓ ఉచిత సలహా పడేశారు. కొందరైతే పనిగట్టుకూని బలవంతం చేశారు. ఒక పక్క పిల్లలు కలగడం లేదన్న సూటిపోటి మాటలు.. మరోవైపు వారు చెప్పిన మాట వినకపోతే కాపురంలో కలతలు వస్తాయేమో అన్న భయాలు.. దీంతో ఆ ఇల్లాలు వద్దని చెప్పలేకపోయింది.

రెండు రోజుల క్రితం బంధువులు సన్నితకు బొడ్డు తాడు తినిపించారు. దీంతో ఆమె అస్వస్థతకు లోనైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సన్నిత మృతి చెందింది. ఘటనపై మృతిరాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వివరాలు సేకరిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం

కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..