
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన మల్లేష్ ప్రొక్లైనర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతనికి ఐదేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే మల్లేష్‌కు పెళ్లికి ముందే నుండే దుర్గా అనే యువతితో పరిచయం ఉంది. దుర్గాకి మరొక వ్యక్తితో వివాహం కాగా అతనితో గొడవ పడి విడిపోయింది. దుర్గాకి ఒక బాబు పుట్టిన తర్వాత దంపతులకు మల్లేష్ విషయంలోనే విబేధాలు వచ్చాయి. అప్పటి నుండి దుర్గా.. మల్లేష్ కు దగ్గరైంది. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గా మల్లేష్‌కి ఆటో కొని ఇచ్చింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో కొద్దికాలం పాటు తేనె విక్రయించారు. అయితే తన కొడుకును చదివించాలన్న ఉద్దేశంతోనే దుర్గా తెనాలి వెళ్లింది.
అప్పటి నుండి మల్లేష్ దుర్గను సరిగ్గా పట్టించుకోవడం లేదు. దీంతో దుర్గా.. మల్లేష్ తో ఘర్షణ పడుతుంది. నీకోసమే భర్త సైతం వదిలి వచ్చినా పట్టించుకోవడం లేదని గొడవ పడింది. మల్లేష్ మాత్రం భార్యతో సుఖంగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేయడంపై ఆవేదనకు లోనైంది. నెల రోజుల క్రితం మల్లేష్ కూడా దుర్గా బైక్‌ను ధ్వంసం చేశాడు. ఇద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చారు. ఆ క్రమంలోనే తన భార్య కూడా తనతో ఉండటం లేదని మల్లేష్ దుర్గా కు చెప్పాడు. కావాలంటే మాఇంటికి వచ్చి చూడమని చెప్పాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే నిన్న దుర్గా మల్లేష్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మల్లేష్ ఇంటిలో లేడు.
ఈ క్రమంలో తనతో పాటే తెచ్చుకున్న పెట్రోల్ మల్లేష్ ఇంటిలో మంచంపై పోసి చచ్చిపోతానంటూ దుర్గా బెదిరించింది. అప్పటికీ ఇంటిలో మల్లేష్, భార్య, మల్లేష్ తల్లి, అతని పిల్లలు ఉన్నారు. దుర్గా తనతో పాటు తెచ్చుకున్న లైటర్‌ను వెలిగించడంతో ఒక్కసారి మంటలు ఎగిసి పడ్డాయి. ఇంట్లో ఉన్న పదిమందిని మంటలు చుట్టుకోవడంతో అందరూ హాహాకారాలు చేశారు. సకాలంలో స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి అందరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో దుర్గాకే ఎక్కువ గాయాలయ్యాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మల్లేష్ కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా మరో నలుగురు స్వల్ప గాయాలకు చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్ళారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..