Vijayawada: వద్దంటున్నా అలా చేస్తున్నాడని కోపం.. భార్య చేసిన పనికి అంతా షాక్.!

| Edited By: Ravi Kiran

Dec 17, 2023 | 4:34 PM

వద్దంటున్నా భర్త ప్రతీరోజూ అలా చేస్తున్నాడని కోపం తెచ్చుకుంది భార్య.. ఆమె చివరికి చేసిన ఓ పనికి మొత్తం అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా..!

Vijayawada: వద్దంటున్నా అలా చేస్తున్నాడని కోపం.. భార్య చేసిన పనికి అంతా షాక్.!
Husband Wife[1]
Follow us on

మద్యానికి అలవాటైన భర్త బాధ్యతలు మరిచి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడన్న కోపంతో భార్య ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లాలోని బేతవోలు గ్రామంలోని పేదపేటకు చెందిన కొదమకొండ్ల మురళి కృష్ణ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చిన్న చిన్న పనులకు వెళ్తూ ఇంట్లోనే ఉంటుంది. వీరికి పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు కుడా ఉన్నారు. డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త మద్యానికి అలవాటు పడి పచ్చి తాగుబోతుగా మారాడు. నిత్యం తాగుతూ.. భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. సంపాదించిన సొమ్మును మద్యానికి తగలపెడుతుండేవాడు.

దీంతో భార్య లక్ష్మీజ్యోతి.. ఎప్పుడూ అతడిని మందలిస్తూ ఉంటుంది. పైసా కూడా పొదుపు చేయటం లేదంటూ ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలో శనివారం భర్తతో గొడవపడ్డ లక్ష్మీ.. అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను.. భర్త, పిల్లలు హుటహుటిన గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త సంపాదన వృధా చేస్తున్నాడని.. క్షణికావేశంలో ప్రాణాలు విడిచింది భార్య. దీంతో ఆమె పిల్లలు తల్లిలేని వారిగా మిగిలిపోయారు.