చిచ్చు రేపిన మద్యం రక్కసి.. మత్తులో భార్య అనే కనికరం లేకుండా.. ఎంత పని చేశాడంటే

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, మరో కుమారుడితో హాయిగా శేషజీవితం గడుపుతున్న ఆ కుటంబంపై మద్యం పిశాచి కోరలు చాచింది. భర్త మద్యానికి(Wine) బానిసవడంతో...

చిచ్చు రేపిన మద్యం రక్కసి.. మత్తులో భార్య అనే కనికరం లేకుండా.. ఎంత పని చేశాడంటే
Wife Murder

Updated on: Mar 07, 2022 | 10:45 AM

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, మరో కుమారుడితో హాయిగా శేషజీవితం గడుపుతున్న ఆ కుటంబంపై మద్యం పిశాచి కోరలు చాచింది. భర్త మద్యానికి(Wine) బానిసవడంతో ఆ ఇల్లాలు తీవ్ర మనోవేదన పడింది. తన భర్తను ఆ అలవాటు నుంచి దూరం చేయాలని శతవిధాలా ప్రయత్నించింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా.. భార్యపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య(Murder) చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అనంతపురం(Anantapur) జిల్లా శెట్టూరు మండలంలోని పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్పకు కర్ణాటక ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.వీరికి ముగ్గురు కుమారులు సంతానం. వీరిలో ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి.

ఈ క్రమంలో నరసింహప్ప మద్యానికి బానిసయ్యాడు. ఎలాంటి పనులు చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ భార్యతో గొడవపడేవాడు. ఒక్కపూట మద్యం తాగకపోయినా విచిత్రంగా ప్రవర్తించేవాడు. మద్యం అలవాటు మానుకోవాలని లక్ష్మీదేవి కోరినా.. అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మొత్తం సంసారాన్ని తానే నెట్టుకొస్తున్నానని, రోజూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ రోజు రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని లక్ష్మీదేవిని అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో మత్తులో విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న లక్ష్మీదేవిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఉదయం అందరూ నిద్ర లేచి చూసే సరికి లక్ష్మీదేవి చనిపోవడాన్ని గుర్తించారు. ఏం జరిగిందంటూ నరసింహప్పను నిలదీశారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు.

Also Read

Vizag Steel Plant Jobs: బీటెక్‌ గ్రాడ్యుయేట్లకు తీసికబురు! వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 206 అప్రెంటిస్‌ ఖాళీలు..3 రోజులే గడువు!

Homemade face scrubs: ఈ ఫేస్‌ స్క్రబ్బర్లను వాడారంటే.. డ్రై స్కిన్‌, ఆయిల్ స్కిన్‌, మృతకణాలకు చెక్‌ పెట్టొచ్చు!

State Bank of India: పీఎఫ్‌ ఖాతాదారులకు SBI బంపరాఫర్‌ !! వీడియో