ఆమెకు 15 మంది బాయ్‌‌ఫ్రెండ్స్.. ఒకరికి తెలియకుండా మరొకరితో.. సీన్ కట్ చేస్తే.!

|

Oct 28, 2022 | 12:52 PM

ఒకరు, ఇద్దరు ఏకంగా పదిహేను మంది బాయ్‌ఫ్రెండ్స్‌..ట్రెండో, ఫ్యాషనో మరీ మొత్తానికి ప్రియుడి మోజులో పడి భర్తనే చంపేసింది.. అందుకు ఓ మాస్టర్‌ ప్లాన్..

ఆమెకు 15 మంది బాయ్‌‌ఫ్రెండ్స్.. ఒకరికి తెలియకుండా మరొకరితో.. సీన్ కట్ చేస్తే.!
Bengaluru Incident
Follow us on

ఒకరు, ఇద్దరు ఏకంగా పదిహేను మంది బాయ్‌ఫ్రెండ్స్‌..ట్రెండో, ఫ్యాషనో మరీ మొత్తానికి ప్రియుడి మోజులో పడి భర్తనే చంపేసింది.. అందుకు ఓ మాస్టర్‌ ప్లాన్ కూడా వేయగా దీనికి ప్రియుడు కూడా సహకరించాడు..అయితే ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పటికీ పట్టించుకోకుండా అడుగులేసింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.

ఐటీ హబ్ బెంగళూరులో చంద్రశేఖర్‌, శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు.ఉదయం ఇంటి టెర్రాస్ మీద రక్తపుమడుగులో కనిపించాడు.భర్త మర్మాంగం కోసేసి తల మీద ఎవరో దాడి చేశారు..వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతని ప్రాణం పోయింది.ఈ హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ బెంగళూరు యలహంకలో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు శ్వేతాని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు.అయితే మామతో పెళ్లి ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది.. బెంగళూరులో MSC చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్‌ చేసింది.కనీసం 15 మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టేదని తెలిసింది.ఆ తర్వాత శ్వేత హిందూపురం నివాసి సురేష్‌తో చనువుగా ఉండేది..ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి.

దీంతో తన భర్త చంద్రశేఖర్ బతికుంటే మనం కలుసుకోవడం కష్టం అని అనుకున్న శ్వేతా ఆమె భర్త చంద్రశేఖర్ హత్యకు స్కెచ్ వేసింది..శ్వేతా భర్తను హత్య చెయ్యడానికి హిందూపురం నుంచి సురేష్ బెంగళూరుకు వచ్చాడని పోలీసులు అన్నారు. ఇక చంద్రశేఖర్ హత్య కేసులో అతని భార్య శ్వేతా, ఆమె ప్రియుడు సురేష్‌ను అరెస్టు చేశామన్నారు.(Source)