Weekend Hour: ఏపీలో గజిబిజిగా పొలిటికల్ చిత్రం.. 2014 పొత్తులు రిపీట్ అవుతాయా..?

|

Sep 30, 2023 | 7:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయ చిత్రం.. చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయం.. అలాగే బీజేపీ-జనసేన మధ్య కూడా పొత్తు ఖాయమే. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలవనంటోంది.. అదే సమయంలో టీడీపీకి స్నేహ హస్తం అందిస్తోంది సీపీఐ. మరోవైపు కాంగ్రెస్‌ కూడా పొత్తుల్ని బలంగా కోరుకుంటోంది. మరి సైకిల్ స్టాండ్ ఏంటి..? కమలం రూట్ ఎటు? హస్తం ఇస్తున్న మెసేజ్‌ ఏంటి? ఎవరు ఎవరితో కలుస్తారు.. ఎవర్ని ఎవరు వదిలేస్తారు..? ఏపీలో ఆల్‌జీబ్రా పాలిటిక్స్‌.. పార్టీల గుండెల్లో గాభరా పుట్టిస్తున్నాయి.

Weekend Hour: ఏపీలో గజిబిజిగా పొలిటికల్ చిత్రం.. 2014 పొత్తులు రిపీట్ అవుతాయా..?
Weekend Hour
Follow us on

ఏపీలో పొలిటికల్ చిత్రం ఇలాగే గజిబిజి గందరగోళంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేయబోతుంది. మరి విపక్షాల దారెటు? 2014 ఎన్నికల పొత్తు సీన్ రిపీట్ అవుతుందా..? లేదంటే ఈసారి రాజకీయ సమీకరణాలు మారుతాయా..? ఒకవేళ మారితే పొత్తుల చిత్రం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అలాగే టీడీపీతోనూ దోస్తీ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. స్కిల్ స్కామ్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్.. ఆ తర్వాత కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి పోరాటానికి సంబంధించి యాక్షన్ ప్లాన్‌ కూడా ఉంటుందన్నారు. అదే సమయంలో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టీడీపీతో పొత్తుకి బీజేపీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం జనసేనతో మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ-బీజేపీ మధ్య సయోధ్య కుదురుతుందా..? కుదరకుంటే పవన్‌ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైనట్టే. ఇక బీజేపీ కూడా కలిసొస్తే తమకు తిరుగు ఉండదన్నది టీడీపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. కానీ అదంత ఈజీగా కనిపించడం లేదు. పైగా చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో కమలం పార్టీ ఎలాంటి స్టాండ్‌తో ముందుకెళ్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు సీపీఐ నేతలు పొత్తులకు సిద్దమని సంకేతాలిచ్చారు. కాకపోతే కూటమిలో కమలం ఉండకూడదని కండీషన్ పెట్టారు. అంటే టీడీపీ-జనసేనతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కానీ ఇందుకు టీడీపీ, జనసేన సుముఖంగా కనిపించడం లేదు.

మరోవైపు హస్తం పార్టీ కొత్త ఫార్మూలా తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్‌తో టీడీపీ, జనసేన, లెఫ్ట్‌పార్టీలు కలిస్తే ఏపీలో క్లీన్‌ స్వీప్ గ్యారంటీ అన్నారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్‌. 175 అసెంబ్లీ.. 25 లోక్‌సభ స్థానాలు కూటమి గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్‌గా టీడీపీతో బీజేపీ కలుస్తుందా..? జనసేన లేకుండా బీజేపీ బరిలోకి దిగుతుందా? లెఫ్ట్‌ పార్టీలతో టీడీపీ, జనసేన పొత్తు సాధ్యమేనా? ఎవరి ప్రపోజల్ వారిది.. ఎవరి వ్యూహం వారిది. చివరగా మింగిల్ అయ్యేదెవరు..? సింగిల్‌గా మిగిలేదెవరు? ఏపీ నాట ఆల్‌ జిబ్రా పాలిటిక్స్‌ మాత్రం ఆద్యంతం ఆసక్తి రేపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..