AP – Telangana: మంగళవారం ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పలు చోట్ల పిడుగులు..

|

Mar 27, 2023 | 8:07 PM

అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల రైతులను భయపెడుతున్నాయి. వడగండ్ల వాన టెన్షన్ పట్టుకుంది. మరోసారి సారి ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్‌మెంట్.

AP - Telangana: మంగళవారం ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పలు చోట్ల పిడుగులు..
Rain Alert
Follow us on

తెలుగు రాష్ట్రాలను వానల ముప్పు వీడలేదు.  ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీతో పాటు యానాం మీదుగా అల్పపీడనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు (సోమ, మంగళవారాలు) వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మళ్లీ రెయిన్ అలర్ట్ జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..