Ap Weather: ఏపీలోని 105 మండలాలపై తుఫాన్ ప్రభావం.. విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్ట్.. కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవే

|

Oct 21, 2022 | 5:45 PM

ఏపీపై తుఫాన్ ప్రభావం ఉంటుందా..? ఉంటే ఎంతమేర ఉంటుంది..? ఏయే ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందో వివరాలు తెలుసుకుందాం పదండి..

Ap Weather: ఏపీలోని 105 మండలాలపై తుఫాన్ ప్రభావం.. విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్ట్.. కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవే
Ap Weather Alert
Follow us on

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శనివారం తూర్పు మధ్య & ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై వాయుగుండంగా, ఆదివారంకు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆ తదనంతరం ఇది సోమవారం (అక్టోబరు 24) నాటికి ఉత్తరం వైపుకు తిరిగి పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని.. ఆ తర్వాత క్రమంగా ఈశాన్య దిశగా కదులుతూ అక్టోబర్ 25న ఒడిశా తీరాన్ని దాటి పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీరాలు – సుందర్‌బన్ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై స్వల్ప ప్రభావం చూపుతుందని విపత్తుల సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా కోస్తా జిల్లాల యంత్రాంగాన్ని, ప్రభావం ఉంటుందని భావిస్తున్న 105 మండలాల అధికారులను తగిన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధత చేసినట్లు వివరించారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదన్నారు. అత్యవసర సహయం, తుఫాను సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 సంప్రదించాలన్నారు. ప్రజలు తుఫాను ప్రభావం బట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
————————————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————————-

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-
——————-

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..