Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

|

Aug 28, 2021 | 8:07 AM

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు రాగాల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ లో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని..

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
Ap Weather Report
Follow us on

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు రాగాల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ లో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలో చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర పశ్చిమ పరిసర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో బెంగాల్ తీరం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ వద్ద 3.1 కి.మీ వద్ద ఇంకో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాగల 5 రోజులు పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు ముఖ్యంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, కోమరంభీం, జనగామ, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక శుక్రవారం పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 8.3 సెం.మీ , జయశంకర్ భూపాలపల్లి లో 6.8  సెం.మీ, కోమారంభిం లో 6.68 సెం.మీ, సిద్దిపేట లో 6.4 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపింది. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో నిన్న వర్షపాతం 8 నుంచి 3 సెం.మీ పైనే వర్షపాతం నమోదఅయ్యింది.

ఇక మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని .. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Also Read:  Anchor Rashmi: నీలి రంగు చీరలోనా చందమామ నీవే జానా.. ఫిదా చేస్తున్న రష్మీ లేటెస్ట్‌ శారీ ఫొటోలు.