AP Weather: ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇదిగో ఈ ప్రాంతాల్లోనే

ఏపీలో అకాల వర్షాలు పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పటికే బోలెడంత పంట నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల పిడుగులు పడి.. గేదెలు, జీవాలు మృతి చెందాయి. అప్పటికప్పుడే కమ్ముకొస్తున్న మబ్బులతో రైతులు కంగారు పడతున్నారు.

AP Weather: ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇదిగో ఈ ప్రాంతాల్లోనే
Andhra Weather Report

Edited By:

Updated on: Apr 07, 2023 | 6:15 AM

గాలి కోత ఇప్పుడు ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.మరియు రాయలసీమలో దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

—————————–

గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

శనివారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————–

గురువారం, శుక్రవారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శనివారం :-  పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ :-

—————-

గురువారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం : పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..