AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. అక్కడ వర్షాలు

|

Oct 09, 2024 | 1:40 PM

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. అక్కడ వర్షాలు
Andhra Weather Report
Follow us on

ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములోనున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5 కి.మీ. ఎత్తులో విస్తరించి నేడు బలహీనపడింది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణం లోతూర్పు మరియు ఆగ్నేయ దిశ గా గాలులు వీస్తాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

గురువారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

 

రాయలసీమ :-

బుధవారం, గురువారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..