AP Weather: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

|

May 21, 2023 | 4:45 PM

మండు వేసవిలోనూ అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. తాజాగా పలు జిల్లాలకు పిడుగుల అలెర్ట్ ఇచ్చింది.

AP Weather: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Lightning Strike
Follow us on

ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది  విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు ఉందని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైయస్సార్ జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం  ఉందని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సూచించింది. ఒకవేళ పిడుగుల పడేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకుంటే చెప్పులు ధరించి చెవులు మూసుకుని మోకాలిపై కూర్చోవాలని సూచించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇక నైరుతి రుతుపవనాలు రాగల 2-3 రోజులలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉండి కొనసాగుతున్నది. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఇపుడు బలహీన పడినది. ఆంధ్ర ప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం, సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు30 – 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.

మంగళవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఆదివారం, సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

మంగళవారం: తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.

రాయలసీమ :-

ఆదివారం, సోమవారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C వరకు ఎక్కువుగా నమోదు కావచ్చును.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.

మంగళవారం: తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..