AP Weather: రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా…

|

Jul 28, 2024 | 12:39 PM

ఏపీలో వారం పాటు వర్షాలు దంచి కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడే వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ ఏపీలో వానలు ఉంటాయా..? ఆంధ్రాలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి....

AP Weather: రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా...
Weather
Follow us on

ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పరిసర ప్రాంతాలపై గల ఉపరితల అవర్తనము ఇపుడు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంపై కొన సాగుతున్నది.  ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉన్నది. 21° ఉత్తర అక్షాంశము వద్ద షీర్ జోన్ సగటు సముద్ర మట్టము నుండి 3.1 & 7.6 కి.మీ ఎత్తు లో కొనసాగుతున్నది మరియు ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈ పరిస్థితుల్లో  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

ఆదివారం, సోమవారం :– తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

ఆదివారం, సోమవారం,  మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

—————-

ఆదివారం, సోమవారం,  మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..